లక్నోలో భారీ డ్రగ్స్ గుట్టురట్టు: యాభై కోట్ల విలువైన హెరాయిన్ సీజ్
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Lucknow
ఢిల్లీ పోలీసులు లక్నోలోని జానకీపురంలో జరిపిన మెరుపు దాడిలో అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల ముఠా గుట్టురట్టయింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో సుమారు యాభై కోట్ల విలువ చేసే ఏడు కిలోలకు పైగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి తయారీకి ఉపయోగించే రసాయనాలు, యంత్రాలను కూడా సీజ్ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ దందాపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.