అంతర్జాతీయ చమురు భారం: భారత్ ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న తీవ్ర ఒత్తిళ్లు
రిపోర్టర్: నరేష్
స్థలం: న్యూఢిల్లీ
అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల ప్రభావం భారత్ పై తీవ్రంగా ఉంటుందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ స్పష్టం చేసింది. ఇరాన్ తో అమెరికా సంఘర్షణ మరింత తీవ్రమైతే ముడిచమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆ సంస్థ వెల్లడించింది. ఈ పరిణామాలు భారత విదేశీ మారక ద్రవ్య మార్కెట్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పై తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లను పెంచుతాయని నివేదిక ద్వారా హెచ్చరించారు.