బెంగళూరులో దారుణం: నూడిల్స్ కారంగా ఉన్నాయని ఫాస్ట్ ఫుడ్ సిబ్బందిపై దాడి
రిపోర్టర్: విజయ్
స్థలం: బెంగళూరు
కర్ణాటకలోని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో నూడిల్స్ కారంగా ఉన్నాయనే చిన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు రెచ్చిపోయారు. దొడ్డతొగురు ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న నిందితులు ఫాస్ట్ ఫుడ్ దుకాణం సిబ్బందిపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు గురువారం వెల్లడించారు.