అన్నమయ్య జిల్లాలో గ్రామాలు రాత్రి బస చేస్తూ పోలీసుల అవగాహన
రిపోర్టర్: సునీల్
స్థలం: అన్నమయ్య
అన్నమయ్య జిల్లా మదనపల్లె ప్రాంతంలో ప్రజల భద్రత కోసం పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది గ్రామాల్లో రాత్రి బస చేస్తూ ప్రజలకు భద్రతా చర్యలపై విస్తృతమైన అవగాహన కల్పిస్తున్నారు. నేరాల నియంత్రణ, రక్షణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ఈ ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతోంది.