జైలర్ 2 చిత్రంలో బోధి పాత్రలో ఎస్ జె సూర్య లుక్ విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: చెన్నై

సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం జైలర్ 2. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు ఎస్.జే. సూర్య అత్యంత శక్తివంతమైన బోధి అనే పాత్రలో నటిస్తుండగా, ఆయన పాత్రను పరిచయం చేస్తూ సన్ పిక్చర్స్ సంస్థ ఒక అదిరిపోయే క్యారెక్టర్ ప్రోమోను రిలీజ్ చేసింది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.