ఆసియా క్రీడల షూటింగ్ ఈవెంట్లలో భారత్కు రెండు కాంస్య పతకాలు

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలలో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్లో రైజా ధిల్లాన్, పరినాజ్ ధాలివాల్, మహేశ్వరి చౌహాన్ సంయుక్తంగా పోరాడి భారత్కు కాంస్య పతకం అందించారు. అలాగే పురుషుల స్కీట్ టీమ్ విభాగంలో అనంతజీత్ సింగ్ నరుకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేగ్ సింగ్ కూడా కాంస్య పతకం సాధించి దేశ కీర్తిని ఇనుమడింపజేశారు.