ఖమ్మం జిల్లాలో విషాదం: బేతుపల్లి చెరువులో గల్లంతైన పది మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది

రిపోర్టర్: రమేష్ స్థలం: Khammam

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువులో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు వెళ్లిన పది మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లు బోల్తా పడటంతో గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తున్న చెరువులో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని సీఎం రేవంత్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.