సోషల్ మీడియా వేధింపుల కేసులో గేమింగ్ క్రియేటర్ ధను డినోపై కేసు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

ట్రైటర్స్ రియాలిటీ షో కంటెస్టెంట్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధను డినోపై నటి శ్రీదేవి చౌడరి ఫిర్యాదు మేరకు జూబ్లీ హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తనను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టి ధను డినోకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఈ ఆరోపణలను ధను డినో ఖండించగా, ఆయనకు మద్దతుగా కొందరు ప్రముఖులు నిలిచారు.