ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో భారత్ అద్భుత విజయం

రిపోర్టర్: అశోక్ స్థలం: రాజ్‌కోట్

రాజ్‌కోట్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి యూత్‌ వన్డేలో భారత్‌ అండర్‌-19 జట్టు 7 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. యశ్‌వర్ధన్‌ చౌహాన్‌ అర్ధశతకంతో రాణించగా, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్ ద్రవిడ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా జట్టు లక్ష్య ఛేదనలో తడబడి 7 వికెట్లకు 175 పరుగులు మాత్రమే చేయగలిగింది.