విషాదం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి డి.సి. రోశయ్య కన్నుమూత

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.సి. రోశయ్య వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.