పేదవాడికి పార్టీ ఉండదు పేదల కోసం పనిచేయడమే లక్ష్యం

రిపోర్టర్: శివ స్థలం: గూడూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో పేదవాడికి ఎలాంటి పార్టీ ఉండదని, పేదల కోసం పనిచేయడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ గూడూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పునరుద్ఘాటించారు.