పక్షవాతపు చీకట్లను తరిమేస్తూ గ్రామీణుల పాలిట నిలిచిన ఉచిత నాడీ వైద్యం
రిపోర్టర్: Venkey ...Nlr
స్థలం: పొదలకూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురం గ్రామంలో ఎనెల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో శనివారం ఉచిత మొబైల్ న్యూరో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యూరాలజిస్ట్ డాక్టర్ లావణ్య మాట్లాడుతూ పక్షవాతం సంభవించిన గోల్డెన్ అవర్ లోగా ఆసుపత్రికి చేర్చడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నాటు మందుల అపోహలు వీడి తక్షణమే వైద్య సహాయం పొందాలని సూచించారు. గ్రామీణులకు ఉచితంగా నాడీ సంబంధిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి ఎండీ నాగేంద్ర ప్రసాద్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.