క్యాన్సర్ లేకున్నా శస్త్రచికిత్స పేరుతో ఆసుపత్రి భారీ బిల్లు వడ్డన

రిపోర్టర్: వెంకట్ స్థలం: మహారాష్ట్ర

ముంబైలోని క్రిటికేర్ ఆసుపత్రిలో హెర్నియా ఆపరేషన్ చేయించుకున్న రెజి అబ్రహంకు క్యాన్సర్ సర్జరీ చేసినట్లు తప్పుడు బిల్లు వేశారు. ఎలాంటి క్యాన్సర్ చికిత్స జరగకపోయినా రూ.2.02 లక్షలు బిల్లు వసూలు చేయాలని చూశారు. బాధితుడు నిలదీయడంతో ఇది సిబ్బంది పొరపాటని ఆసుపత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ ఘటనపై బాధితుడు మెడికల్ కౌన్సిల్, ఐర్డాయ్‌కు ఫిర్యాదు చేశారు.