కోర్టు కేసుల్లో విజిటేషన్ పదం వద్దు: కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: Bengaluru

పిల్లల కస్టడీ వ్యవహారాల్లో 'విజిటేషన్' అనే పదాన్ని ఇకపై వాడకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ లలితా కన్నెగంటి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు న్యాయవర్గాలు వెల్లడించాయి. ఏ తల్లిదండ్రులూ పిల్లల జీవితంలో కేవలం అతిథులు కారని, ఆ పదం తప్పుడు భావనను కలిగిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజిటేషన్కు బదులుగా 'పేరెంటింగ్ టైమ్' అనే పదాన్ని మాత్రమే ఉపయోగించాలని కోర్టు స్పష్టం చేసింది.