రాష్ట్రం దాటి నడిచొచ్చిన అభిమానం: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తాయన్న
రిపోర్టర్: రాజేష్
స్థలం: హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన తాయన్న అనే అభిమాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 29వ తేదీన ఆదోని నుంచి హైదరాబాద్ వరకు ఏకంగా మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం తొమ్మిది రోజుల పాటు కాలినడకన ప్రయాణించారు. జూబ్లీ హిల్స్ లోని నివాసానికి చేరుకున్న ఆ అభిమానిని సీఎం రేవంత్ రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించినట్లు అధికారులు తెలిపారు.