వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం: బెంగళూరు ఇంట పెళ్లిపై జగన్ లేఖ కలకలం

రిపోర్టర్: కృష్ణ స్థలం: అమరావతి

వైఎస్సార్ కుటుంబంలో ఆస్తి వివాదం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిందని వైఎస్ విజయమ్మ వెల్లడించారు. బెంగళూరులోని యలహంక ప్యాలెస్లో సోదరి షర్మిల కుమార్తె వివాహం జరిపించవద్దంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాయడం కలకలం రేపింది. భద్రతా సమస్యల కారణంగా అక్కడ పెళ్లి చేయడం కుదరదని జగన్ స్పష్టం చేయగా, ఆ ఇల్లు షర్మిలదేనంటూ విజయమ్మ గతంలో ఇచ్చిన నోటరీ ప్రకటన ప్రస్తుతం తెరపైకి వచ్చిందని కుటుంబ సన్నిహితులు తెలిపారు.