సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
రిపోర్టర్: రమేష్
స్థలం: నాగర్ కర్నూల్
సైబర్ మోసాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నాగర్ కర్నూల్ ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆగండి, ఆలోచించండి, అడుగువేయండి అను మూడంచల సూత్రాన్ని విధిగా పాటించాలని సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో అక్టోబర్ నెలలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ నాగర్ కర్నూల్ వెల్లడించారు.