కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో విద్యార్థుల ఘర్షణ, తీవ్ర ఉద్రిక్తత
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ కూకట్‌పల్లి జేఎన్‌టీయూలో తీజ్ పండుగ వేడుకల సందర్భంగా విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. మంజీరా, గౌతమి హాస్టల్ విద్యార్థులు కర్రలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో క్యాంపస్ రణరంగంగా మారింది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దాడికి నిరసనగా విద్యార్థులు ప్రధాన గేటు ముందు ధర్నా నిర్వహించారు.