ఢిల్లీలో షాకింగ్ ఘటన: మహిళా ఇంజనీర్పై క్యాబ్ డ్రైవర్ దాడి

రిపోర్టర్: సురేష్ స్థలం: Delhi

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఉబర్ క్యాబ్లో ఇంటికి వెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అదనపు డబ్బు డిమాండ్ చేస్తూ డ్రైవర్ జమిల్ జాహిద్ ఖాన్ తీవ్రంగా బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. యాప్లో చూపిన మొత్తం కంటే రెట్టింపు డబ్బు ఇవ్వాలంటూ ఆమెపై చేయి చేసుకుని, ఇంటి వరకు వెంబడించి దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేయగా, స్పందించిన పోలీసులు తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.