ఇజ్రాయెల్ దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరాన్ విదేశాంగ మంత్రి
రిపోర్టర్: అశోక్
స్థలం: ఇరాన్
ఇజ్రాయెల్ గాజాలో సాగిస్తున్న దాడులు, మధ్యప్రాచ్యంలో సైనిక చర్యలపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జకార్తాలో జరిగిన గ్లోబల్ టౌన్‌హాల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెల్, అమెరికా దురాక్రమణ విధానాలను తప్పుబట్టారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కఠినమైన జవాబుదారీతనం ఉండాలని, సైనికవాదం వీడి దౌత్యం వైపు మొగ్గు చూపాలని అరాగ్చి పిలుపునిచ్చారు.