ఖమ్మం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది: కలెక్టర్ దివాకర

రిపోర్టర్: Narendra kumar kinnera స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో వేగంగా దూసుకుపోతోందని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పేర్కొన్నారు. మంత్రుల ప్రత్యేక చొరవతో నిధులు సమృద్ధిగా అందుతున్నాయని, దీనివల్ల జిల్లాలో అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవుతున్నాయని ఆయన వెల్లడించారు.

ఇతర జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలో పనులు అత్యంత వేగంగా, పారదర్శకంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని, ఈ వేగం ఇలాగే కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.