రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్ డిమాండ్ మంత్రి గొట్టిపాటి వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ డిమాండ్ 50 మిలియన్ యూనిట్లు అదనంగా పెరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. గతేడాది 240 ఎంయూలుగా ఉన్న డిమాండ్ ప్రస్తుతం 290 ఎంయూలకు చేరిందని, వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా డిమాండ్‌కు తగినట్లుగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్ కొనుగోలు చేస్తూ సరఫరా చేస్తున్నామని ఆయన గురువారం అమరావతిలో ఒక ప్రకటనలో పేర్కొన్నారు.