అట్లాంటాలో శ్రీవారి ఉదయస్తమాన సేవా మహోత్సవం: వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు
రిపోర్టర్: రమేష్
స్థలం: Atlanta
అట్లాంటా హిందూ ఆలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 24వ తేదీన శ్రీవారి ఉదయస్తమాన సేవా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. తిరుమలలో జరిగే శ్రీవారి సేవల మాదిరిగానే ఉదయం సుప్రభాత సేవల నుంచి రాత్రి శయనోత్సవం వరకు పూర్తి రోజు పాటు దివ్యమైన సేవలు ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావాలని ఆలయ అధ్యక్షులు రవి, పూజా కమిటీ చైర్ అరుణ కైలాస కోరారు.