సెల్‌ఫోన్ రిపేర్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో యువతి మృతి
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ అమీర్‌పేట శ్రీనగర్ కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమవరానికి చెందిన వి.హేమదుర్గ దుర్మరణం చెందింది. సెల్‌ఫోన్ రిపేర్ కోసం ర్యాపిడో బైక్‌పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. బంజారాహిల్స్‌లోని కార్ల కంపెనీలో పనిచేస్తున్న హేమదుర్గ మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.