కాగజ్నగర్ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ స్వాధీనం

రిపోర్టర్: రమేష్ స్థలం: కాగజ్ నగర్

ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ఒక లారీని స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ ఎస్సై డి.సాగర్ తెలిపారు. పెద్ద బండ ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా హీరాపూర్ వైపు నుండి ఆదిలాబాద్ మార్గంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను తరలిస్తున్న లారీని గుర్తించి సీజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్తో పాటు యజమాని అబ్దుల్ మజీద్ ఖాన్ సహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు.