మర్రిపాడులో దారుణం: సోదరుడిని రోకలిబండతో మోది హత్య చేసిన తమ్ముడు

రిపోర్టర్: కిరణ్ స్థలం: మర్రిపాడు

మర్రిపాడు మండలం నాగరాజుపాడు గ్రామంలో వ్యక్తిగత కక్షల నేపథ్యంలో దారుణ హత్య చోటుచేసుకుంది. ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న రాజగోపాల్పై తమ్ముడు గోపి రోకలిబండతో దాడి చేసి హత్య చేసినట్లు ఎస్సై బలరామిరెడ్డి తెలిపారు. గతంలో జరిగిన గొడవ కారణంగా కక్ష పెంచుకున్న నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని, హత్య అనంతరం పెద్ద అన్నకు వాట్సాప్లో ఫొటోలు పంపాడని పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.