పార్వతీపురంలో గొలుసు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల ఉక్కుపాదం
రిపోర్టర్: హరి
స్థలం: పార్వతీపురం మన్యం
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్సైజ్ అధికారులు గొలుసు దుకాణాలపై దాడులు ముమ్మరం చేశారు. వారం రోజుల్లో చేపట్టిన తనిఖీల్లో 28 కేసులు నమోదు చేసి, 28 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 34 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ తెలిపారు. సారా మరియు గొలుసు దుకాణాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అసాధారణ కార్యకలాపాలు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు.