తప్పుడు ఆరోపణలపై మహేశ్ కుమార్ గౌడ్‌పై పరువు నష్టం దావా వేసిన హరీష్ రావు

రిపోర్టర్: అశోక్ స్థలం: సిద్దిపేట

తాను క్షుద్ర పూజలు చేశానంటూ నిరాధార ఆరోపణలు చేసిన పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు అద్దంకి దయాకర్‌లపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశారు. కోర్టు ఈ పిటిషన్‌ను స్వీకరించిందని తెలిపారు. అబద్ధాలను ప్రచారం చేసే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎంత దూరమైనా పోరాడి వారికి చట్టపరమైన శిక్ష పడేలా చూస్తామని హరీష్ రావు తీవ్రంగా హెచ్చరించారు.