స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లలో ఉద్రిక్తత: పుంగనూరు రాయచోటిలో ఘర్షణలు

రిపోర్టర్: రాము స్థలం: అన్నమయ్య జిల్లా

అన్నమయ్య జిల్లా పుంగనూరు మరియు రాయచోటిలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల తొలిరోజే తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాలు ఒకేసారి నామినేషన్ కేంద్రాలకు వెళ్లడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తిందని, పరస్పర రాళ్లదాడుల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయని వారు పేర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చిందని, రాయచోటిలో కార్లకు నిప్పు పెట్టడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.