గుర్గావ్‌లో మహిళా బైకర్‌పై కారుతో ఢీ కొట్టి పరారీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హర్యానా

గుర్గావ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో మహిళా బైకర్ సియాను కారుతో ఢీకొట్టి పరారైన ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు కారుతో వెంబడించి తన బైక్‌ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లినట్లు బాధితురాలు ఆరోపించారు. కారు యజమాని మనీష్ అందించిన సమాచారం ప్రకారం, నిందితుడు కళ్యాణ్ సింగ్ రెండు రోజుల క్రితం కారు తీసుకువెళ్లి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు తీవ్రం చేశారు.