ట్యాంక్ బండ్ పరిసరాల్లో డీజేలపై కఠిన ఆంక్షలు విధించిన ఏసీపీ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ట్యాంక్ బండ్ పరిసరాల్లో డీజే సౌండ్ సిస్టంలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నట్లు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ సమయంలో పోలీసుల కమ్యూనికేషన్‌కు డీజేల అధిక శబ్దం తీవ్ర అంతరాయం కలిగిస్తోందని ఆయన వివరించారు. నిబంధనలు అతిక్రమించి డీజేలు ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.