సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు షాక్: ఇల్లు ఖాళీ చేసిన వీరమణి

రిపోర్టర్: రాము స్థలం: మదురై

దీపావళికి స్వీట్లు పంపాలని కోరిన తమిళనాడు మదురైకి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీరమణికి ఆకతాయిల చేష్టల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆయన అడ్రస్ కు ఆన్ లైన్ లో క్యాష్ ఆన్ డెలివరీ పద్ధతిలో ఖరీదైన వస్తువులు, ఫ్రిజ్ లు, టీవీలను ఆర్డర్ చేయడంతో డెలివరీ సిబ్బందితో పాటు పోలీసుల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఈ డిజిటల్ వేధింపులు తాళలేక చివరకు ఆయన తాను సంవత్సరాలుగా ఉంటున్న ఇల్లును ఖాళీ చేసి వెళ్లిపోవాల్సి వచ్చిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.