ఏఐని భూతంగా చూడొద్దు: భవిష్యత్తులో ప్రభుత్వ శాఖల్లోనూ అనుసంధానిస్తామన్న కేటీఆర్

రిపోర్టర్: విజయ్ స్థలం: హైదరాబాద్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను భూతంగా కాకుండా మానవాళికి ఉపయోగపడే సాధనంగా వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో క్యాంపస్ హబ్ ఏఐ ఉత్పత్తి ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వంలోని అన్ని శాఖలు, వ్యవస్థలతో ఏఐని అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. యువత ఉద్యోగాలు వెతుక్కునే వారిగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.