స్వదేశీ ఉత్పత్తులతో అంతర్జాతీయ ఖ్యాతి: వోకల్ ఫర్ లోకల్పై ఎంపీ డి.కె. అరుణ
రిపోర్టర్: విజయ్
స్థలం: మహబూబ్ నగర్
వోకల్ ఫర్ లోకల్ అనే భావనతో మన దేశంలోని ఉత్పత్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని మహబూబ్ నగర్ ఎంపీ డి.కె. అరుణ వెల్లడించారు. స్థానిక వస్తువుల తయారీని ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతోందని ఆమె తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టితో తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల యువతకు, స్థానిక చేతివృత్తుల వారికి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొంటూ డి.కె. అరుణ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.