కర్నూలు జిల్లాలో వస్త్ర దుకాణంలో చెలరేగిన భారీ మంటలు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: కర్నూలు

కర్నూలు జిల్లా ఆలూరులోని వెంకటలక్ష్మి వస్త్ర దుకాణంలో షార్ట్ సర్క్యూట్తో అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు మూడు కోట్ల రూపాయల ఆస్తినష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. దుకాణంలో సిబ్బంది అందించిన సమాచారంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాద సమయంలో షాపులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారని పోలీసులు వెల్లడించారు.