సినిమా ప్రియులను కట్టిపడేస్తున్న రామాయణం: మహేష్ బాబు, సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రతిష్ఠాత్మక చిత్రం రామాయణంకు దేశవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోందని ప్రముఖులు తెలిపారు. గ్రాండ్ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్లపై ప్రశంసలు కురుస్తున్నాయని, ఈ సినిమా తనకు ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చిందని ఎక్స్ వేదికగా సూపర్స్టార్ మహేష్ బాబు పేర్కొన్నారు. రాముడు, రావణుడి పాత్రల గొప్పతనాన్ని బిగ్ స్క్రీన్ పై అనుభూతి చెందాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రేక్షకులను కోరారు.