మంచిర్యాల జిల్లా జన్నారంలో హత్యాయత్నం కేసు నిందితుడు అరెస్టు
రిపోర్టర్: gourinatha p.g
స్థలం: జన్నారం
జన్నారం మండలంలోని దేవునిగూడకు చెందిన పోకల వంశీపై కత్తితో హత్యాయత్నం చేయబోయిన కామన్పల్లి గ్రామానికి చెందిన సాట్ల సాయిశివను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో ఒక అమ్మాయి విషయమై తన రహస్యాలు చెప్పాడనే కోపంతో నిందితుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం సోమవారం రిమాండ్కు తరలించినట్లు ఎస్సై స్పష్టం చేశారు.