కంచరకుంట్లలో నూతన వినాయక మండపం ప్రారంభం.. స్థలం విరాళంగా ఇచ్చిన దంపతులకు ఘన సన్మానం!

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండలం కంచరకుంట్ల కాలనీలో నూతనంగా నిర్మించిన వినాయక మండపాన్ని మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని ప్రారంభించారు. మండపం కోసం పదిహేను లక్షల రూపాయల విలువైన స్థలాన్ని విరాళంగా అందించిన సత్తిరెడ్డి, జానకమ్మ దంపతులను ఆమె అభినందించారు. కాలనీలో డ్రైనేజీ, మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చింతల ఉమామహేశ్వరి, పాక చిరంజీవి, పీఏసీఎస్ చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, ఆకుల ఇంద్రసేనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.