ఆసియా క్రీడల్లో రజతం సాధించిన షూటర్లకు పవన్ కల్యాణ్ అభినందనలు
రిపోర్టర్: సురేష్
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆసియా క్రీడలు-2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో రజత పతకం సాధించిన భారత షూటర్లు ఎలవెనిల్ వలరివన్, సోనం ఉత్తమ్ మాస్కర్, విదర్శా కె.వినోద్‌కు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. 1898.0 పాయింట్ల సంయుక్త స్కోర్‌తో అద్భుత ప్రదర్శన కనబరిచి దేశం పతకాల ఖాతాను ప్రారంభించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.