కాణిపాకం వినాయకునికి ప్రత్యేక పట్టు వస్త్రాలు సమర్పించిన చైర్మన్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఐరాల

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాల ప్రత్యేక సందర్భముగా ఈరోజు నాలుగవ రోజు మహానంది ఆలయం నుండి పట్టు వస్త్రములు శ్రీ గణనాధునికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహానంది ఆలయ చైర్మన్ నారాల చంద్రమౌళి రెడ్డి, ఈవో శ్రీనివాసరెడ్డి, ఏఈఓ మధు, బోర్డ్ మెంబర్లు పదిమంది మరియు ఆలయ సిబ్బంది తదితరులు వచ్చి స్వామివారికి ఘనంగా పట్టు వస్త్రములు సమర్పించి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.