ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రాథమిక కీ విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: న్యూఢిల్లీ

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సీబీటీ-2 పరీక్షా ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్ను అధికారులు అధికారిక పోర్టల్లో విడుదల చేశారు. సెప్టెంబర్ 17న జరిగిన ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ ఉపయోగించి ఆన్లైన్లో కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 30వ తేదీ రాత్రి 11:55 గంటలలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి బోర్డు ప్రత్యేకంగా అవకాశం కల్పించింది.