అఖిలేష్ యాదవ్‌కు భారీ షాక్: బీజేపీలో చేరిన ముగ్గురు ఎస్పీ ఎమ్మెల్యేలు
రిపోర్టర్: సునీల్
స్థలం: లక్నో
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, ఆ పార్టీకి చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు రాకేష్ ప్రతాప్ సింగ్, అభయ్ సింగ్, వినోద్ చతుర్వేది బుధవారం అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారని మీడియా వర్గాలు వెల్లడించాయి. గత రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ విప్‌కు వ్యతిరేకంగా ఓటు వేసిన ఈ ముగ్గురు నేతల చేరిక ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.