క్యూ నెట్ మోసం కేసులో సీబీఐ ఎంట్రీ మరియు విచారణ షురూ

రిపోర్టర్: సునీల్ స్థలం: సిద్దిపేట

సంచలనం సృష్టించిన క్యూ నెట్ మోసం కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరుకు చెందిన హరికృష్ణ అనే యువకుడు క్యూ నెట్‌లో రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయి, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు మొదట పోలీసులు, ఆ తర్వాత సీఐడీ దర్యాప్తు చేయగా, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో క్యూనెట్, విహన్ డైరెక్టర్లు సహా మొత్తం 16 మందిపై సీబీఐ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది.