విద్యార్థులకు గుడ్ న్యూస్: క్లాట్ 2027 దరఖాస్తు గడువు పొడిగింపు
రిపోర్టర్: సునీల్
స్థలం: Hyderabad
జాతీయ లా యూనివర్సిటీల కన్సార్టియం కామన్ లా అడ్మిషన్ టెస్ట్ 2027 దరఖాస్తు గడువును మరో వారం రోజులపాటు పొడిగించినట్లు కన్సార్టియం వర్గాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఆసక్తిగల అభ్యర్థులు నవంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.