యాదాద్రి భువనగిరి: స్వర్ణగిరి క్షేత్రంలో భక్తిశ్రద్ధలతో తిరుప్పావడ సేవ

రిపోర్టర్: సురేష్ స్థలం: యాదాద్రి భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో తిరుప్పావడ సేవను వైభవంగా నిర్వహించినట్లు అర్చకులు వెల్లడించారు. సకల ప్రాణికోటికి ఆహార కొరత లేకుండా ఉండాలని మరియు లోక కల్యాణం జరగాలని కోరుకుంటూ స్వామివారికి ఈ విశేష అన్నకూటోత్సవాన్ని ఘనంగా జరిపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు నాలుగు వందల యాభై కిలోల అన్నప్రసాదంతో పాటు లడ్డూలు, వడలు, వివిధ రకాల పిండివంటలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి భక్తి చాటుకున్నారు.