జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

జగన్ అక్రమాస్తుల కేసుల్లో సత్వరం రోజువారీ విచారణ జరిగేలా సీబీఐ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ బి.నరసింహశర్మ తెలిపారు. జగన్తో పాటు సహ నిందితులంతా విచారణకు హాజరయ్యేలా చూడాలని కోరగా, ఈ పిటిషన్ను ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఇతర పిటిషన్లతో కలిపి విచారిస్తామని స్పష్టం చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల పదమూడో తేదీకి వాయిదా వేసింది.