నంది నాటక బహుమతులు మరియు కందుకూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: అమరావతి
నంది నాటక బహుమతులు-2025, కందుకూరి పురస్కారాలు-2026 కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఎండీ కె.ఎస్.విశ్వనాథన్ తెలిపారు. నాటక సమాజాలు, కళాకారులు అక్టోబర్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, దరఖాస్తుల ప్రింట్‌ను అక్టోబరు 26లోగా విజయవాడలోని సంస్థ కార్యాలయానికి పంపాలని పేర్కొన్నారు.