యుపీఎస్సీ ఫలితాలు: వ్యవసాయ కూలీ కొడుకుకు సివిల్స్లో అఖిల భారత 812వ ర్యాంకు

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: జల్నా

మహారాష్ట్రకు చెందిన వ్యవసాయ కూలీ కుమారుడు భికన్ రోజేకర్ తన ఐదో ప్రయత్నంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత 812వ ర్యాంకు సాధించినట్లు బీబీసీ మరాఠీ వెల్లడించింది. జల్నా జిల్లా జల్గావ్ సప్కల్ గ్రామానికి చెందిన ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలుగా పనిచేశారు. కష్టాలను ఎదుర్కొంటూ చదివిన భికన్ రోజేకర్ విజయంతో తన కుటుంబానికి మరియు గ్రామస్థులకు ఎంతో గర్వకారణంగా నిలిచారని అధికారులు, స్థానికులు ప్రశంసించారు.