పూతలపట్టులో చతికిలపడ్డ వైకాపా: స్థానిక సంస్థల్లో తెదేపా దూకుడుతో ఏకగ్రీవాల జోరు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Chittoor
పూతలపట్టు నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా పూర్తిగా వెనుకబడిందని, పలు స్థానాల్లో అభ్యర్థులు కరువయ్యారని ఎన్నికల పరిశీలకులు తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు, యాదమరి, బంగారుపాళ్యం మండలాల్లో వైకాపా నామినేషన్లు దక్కకపోగా, తెలుగుదేశం పార్టీ సులభంగానే జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా అడుగులు వేస్తోందని విశ్లేషకులు స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీకి కనీస పోటీ ఇచ్చే శక్తి కూడా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.