యాదాద్రి జిల్లాలో అనుమానాస్పద రీతిలో యువకుడు అదృశ్యం

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన కోనెటి విజయ్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. తమ్ముడు శ్రీరామ్తో బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన విజయ్ తిరిగి ఇంటికి రాలేదు. అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కుటుంబ తగాదాల కారణంగానే అతను వెళ్లిపోయినట్లు తమ్ముడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ తఖియుద్దీన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆచూకి తెలిసిన చో వెంటనే పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించగరాలని కోరారు.